Car Registration Number: చాలా మంది తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుకుంటారు. అయితే, ఈ ధర ఒక్కోసారి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు చేరుతుంది. పోటీలో పాల్గొనేవారు ఒకరికి మించి మరొకరు ఎక్కుడ డబ్బులు వెచ్చించేందుకు వెనుకాడరు. ఆ నెంబర్ మీద ఎవరైతే ఎక్కువ మొత్తం బిడ్డింగ్ వేస్తారో వారికే దాన్ని కేటాయిస్తారు. అందులో భాగంగానే ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశాడు. HR88B8888 నెంబర్ ప్లేట్ కోసం 1.17 కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఈ సంఘటన హర్యానాలో జరిగింది.
నెంబర్ ప్లేట్ కోసం రూ. 1.7 కోట్లు
హర్యానా ప్రభుత్వం వీఐపీ, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా ప్రతీవారం వేలంపాటలు నిర్వహిస్తూ ఉంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఈ వేలంపాట సాగుతుంది. ప్రతీ బుధవారం సాయంత్రం 5 గంటలకు వేలం పాట ఫలితాలు వస్తాయి. తాజాగా జరిగిన వేలంపాట ఫలితాలు వచ్చాయి. ఓ వ్యక్తి HR88B8888 అనే నెంబర్ మీద బిడ్డింగ్ వేశాడు. ఆ నెంబర్ కోసం ఏకంగా 1.17 కోట్ల రూపాయలు వెచ్చించాడు. అతడి దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు. ఆ నెంబర్ అతడి సొంతం అయింది.
ఫ్యాన్సీ నెంబర్స్ కోసం భారీగా ఖర్చు
ప్రభుత్వం ఆ నెంబర్ ప్లేట్ బేస్ బిడ్డింగ్ ధరను 50 వేల రూపాయలుగా నిర్ణయించింది. వేలంపాటలో నెంబర్ ప్లేట్ ధర 1.17 కోట్లకు చేరుకుంది. గత వారం HR22W2222 నెంబర్ ప్లేటును ఓ వ్యక్తి 37.91 లక్షలు పెట్టి కొన్నాడు. నెంబర్ ప్లేట్ల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాగా పెరిగిపోయాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి గత సంవత్సరం KL 07 DG 0007 నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 46 లక్షలు ఖర్చు చేశాడు.





