
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ జుట్టు ఇప్పటికే అత్యధిక సార్లు ట్రోఫీని కూడా సాధించింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాలలో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎంత పాత్ర పోషించారు అనేది కూడా క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వదులుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ దిగ్గజా స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు అని ప్రశంసించారు. మామూలుగానే ఐపీఎల్ లో CSK జట్టు తమ ప్లేయర్లను సులభంగా వదులుకోదు. ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి జడేజా లాంటి వారిని అసలు బయటకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. కానీ జడేజాను రాజస్థాన్ జట్టుకు అలాగే ఆ జట్టు ప్లేయర్ శాంసన్ చెన్నై కి మారడం అనేది చాలా పెద్ద పరిణామమని వెల్లడించారు. ఎందుకంటే గతంలో గుజరాత్ టైటాన్స్ మీద జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జడేజా చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేసి ట్రోపిని అందజేశారు. అలాంటి ప్లేయర్ ను వదులుకోవడం పట్ల ఇప్పటికే ఫ్యాన్స్ అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు జడేజాకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు ఇస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
Read also : గిల్ గాయం పై అప్డేట్..!
Read also : ముంచుకొస్తున్న మరో తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు!





