
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి హజారుద్దీన్ అని అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని ఆగ్రహిస్తూ ప్రశ్నించారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులోనే మజిలీస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. AIMIM సాధారణంగానే హైదరాబాద్ కు చెందిన పలు నియోజకవర్గాల్లో బలంగా పోటీ చేస్తున్న సందర్భంలో జూబ్లీహిల్స్ వంటి కీలక సీటు లో ఎందుకు దూరంగా ఉంటుందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ ఒప్పందాలపై పూర్తిగా అనుమానాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎంఐఎం పార్టీ ఒక చీడలా మారిందని.. విభజన రాజకీయాలతో రాష్ట్రాన్ని వెనక్కి లాగుతున్న పార్టీగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ప్రగతి, శాంతి మరియు సమాన అభివృద్ధికి ఎంఐఎం అడ్డంకి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.
Read also : నష్ట పోయిన రైతులకు ఎకరాకు 40 వేలు ఇవ్వాలి
Read also : జీహెచ్‌ఎంసీ(GHMC) వాహనంపై విరిగిపడ్డ కొండచరియలు





