తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు

మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- మిర్యాలగూడ నియోజవర్గంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బీఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ఐఎంఏ భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి సర్వ సభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవ నుండి ఎమ్మెల్యేగా ఎదిగానని జర్నలిస్టుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయిస్తామనారు. మండలాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. సమాజ మార్పు కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయాలని అలాంటి విషయాలపై పూర్తి సహకారo అందిస్తామన్నారు. అవాస్తవాలను రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలన్నారు. నియోజవర్గస్థాయిలో ఇంత మంది జర్నలిస్టులు ఒక వేదికలో కనిపించడం సంతోషించ తగ్గ విషయమన్నారు. సామాజిక కార్యకర్తగా రాజకీయాల్లో వచ్చానని ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్నానని ఏ ఒక్కరికి ఆపద వచ్చిన దృష్టికి తీసుకువస్తే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
నియోజవర్గంలో శాంతిభద్రతలు కాపాడేందుకు జర్నలిస్టులు సహకరించాలని స్థానిక డిఎస్పి కె.రాజశేఖర్ రాజు కోరారు. నియోజవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఐక్యంగా హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు తమ దృష్టికి తీసుకువస్తే అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు ఇప్పటివరకు జర్నలిస్టులు శాంతిభద్రతలు కాపాడడంలో పోలీసులకు ఎంతో సహకారీస్తున్నారని భవిష్యత్తులో ఇలాగే కొనసాగించాలని కోరారు. తాను అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువ కాలం పని చేశానని, ఇప్పుడు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పోలీస్ శాఖకు జర్నలిస్టులు అందిస్తున్న సహకారం గొప్పదన్నారు.
నియోజవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అయూబ్ కోరారు. జర్నలిజం ఒక బాధ్యత అని, సామాజిక సేవ అని చెప్పారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారం కోసం అహర్నిశలు జర్నలిస్టులు కృషి చేస్తున్నారని పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.

జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షతను విడనాడాలని సూచించారు. మండలాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని దీనికి ఎమ్మెల్యే, అధికారులు సహకరించాలన్నారు. అనారోగ్యాలకు గురైనప్పుడు జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సేవలో రాయితీలు కల్పించాలని సూచించారు. హామీ ప్రకారం మిర్యాలగూడలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే, అధికారులు ముందుకు రావడం హర్షనీయమన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘాల కతీతంగా జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలన్నారు.జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కులు సాధించబడతాయని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడపురి వెంకన్న అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని వాస్తవంగా దానికి భిన్నంగా జర్నలిస్టులు జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే గొప్పగా ఉంటారని కానీ వారి కుటుంబాలు దయనీయ స్థితిలో గడుపుతున్నారని చెప్పారు. నిత్యం ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టే జర్నలిస్టుల సంక్షేమం కోసం పాలకులు సహకారం అందించాలన్నారు. కడుపులో ఎన్నో బాధలున్న వార్త సేకరించడంలో వాటిని మర్చిపోయి ప్రజలను చైతన్య పరచడానికి జర్నలిస్టులు ఆరాటపడుతుంటారన్నారు. యాజమాన్యాల ఒత్తిడిలను ఎదుర్కొని ఎన్నో ఆటుపోట్లతో జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తుంటారని అలాంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పాలకులు అధికారులు చొరవ చూపాలన్నారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టిడబ్ల్యూజెఎఫ్ మాత్రమే పోరాటం చేస్తుందని అండగా నిలవాలని జిల్లా గౌరవ అధ్యక్షులు ఖాజా హమీదొద్దీన్ అన్నారు. ఫెడరేషన్ ఏర్పాటు చేసిన అప్పటినుండి ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మండలం నుంచి రాష్ట్ర రాజధాని వరకు అనేక ఉద్యమాలు జరిపారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ కృషి చేస్తుందని, జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని జర్నలిస్టులందరూ ఫెడరేషన్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంఘం బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.
జర్నలిస్టుల ఐక్యత కోసం ఫెడరేషన్ కృషి చేస్తుందని నేషనల్ కౌన్సిల్ సభ్యులు గుండా మహేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్ అనేక ఉద్యమాలు చేసిందని జర్నలిస్టులందరూ ఫెడరేషన్ అండగా నిలిచి బలోపేతం చేయాలన్నారు. నియోజవర్గంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్నారు.నిత్యం విధి నిర్వహణలో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనిదని మట్టి మనిషి వేనేపల్లి పాండురంగరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. గ్రామస్థాయి నుండి అనేక సమస్యలను పత్రికల ద్వారా వెలుగులకు తెచ్చి వాటి పరిష్కారం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు సలహాలు అందించాలని గుర్తు చేశారు. జర్నలిస్టులతో ఎంతోకాలంగా తనకు స్నేహబంధం ఉందని తెలిపారు. ఓకే వేదికపై ఇంత మంది జర్నలిస్టులు పాలు పంచుకోవడం హర్షణీయమన్నారు.అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పి లకు శాలువ, పూల బొకేలతో సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వాడపల్లి రమేష్, ఇలియాస్, నాగయ్య, కొండలు, పుల్లారెడ్డి, కాతోజు నాగచారి, కిషోర్, రాంప్రసాద్, ఉప్పుతల మహేష్, బంటు శ్రీను, అరుణ్, నాగరాజు, నాగేందర్, నక్క శ్రీను, ఉమర్, నాసర్, రఫీ, మహిమూద్, బుర్హాన్, చంద్రశేఖర్, వసీం, సతీష్, బి సురేష్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, మచ్చ శ్రీను, సైదులు, నాగేందర్, రాము, పార్థు, వినయ్ పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా సాగిన సమావేశంలో వంద మంది జర్నలిస్టులు హాజరయ్యారు. సభ అనంతరం ఎమ్మెల్యే డీఎస్పీలను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా డిసిసి ప్రధాన కార్యదర్శి బాలుకు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజహర్ లను సన్మానించారు. అందరికీ మెమెంటో అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button