
Hot Water: నెయ్యి భారతీయ ఆహారాలలో ఎంతో ముఖ్యమైన భాగం. చిన్నప్పటి నుంచి పెద్దల మాటల్లో నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తుందో వింటూ పెరిగిన వారమే. భోజనానికి రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి అన్నివిధాలా పోషకాలను అందించే ఆహార పదార్థాల్లో నెయ్యి ప్రత్యేకస్థానం కలిగి ఉంది. చాలామంది దీనిని అన్నంలో, రోటీలపై, పప్పుల్లో లేదా కూరగాయల్లో కలిపి తింటారు. నెయ్యిలో విటమిన్లు A, D, E, K పుష్కలంగా ఉండటంతో పాటు మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ఇనుము వంటి అత్యవసర ఖనిజ లవణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
ఆరోగ్య నిపుణులు చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగితే శరీరానికి ఇంకా గొప్ప ప్రయోజనాలు అందుతాయి. ఇది శరీర శుద్ధి నుండి బరువు తగ్గుదల వరకు పలు మార్గాల్లో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడే వారికి నెయ్యి నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది పేగులలో ఉండే మలినాలను తొలగించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడంలో సహాయపడటంతో పాటు కడుపు బరువు, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఆమ్లత్వం ఎక్కువగా ఉండే వారికి ఇది ఒక సహజ చికిత్సగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటితో కలిపిన నెయ్యి తాగడం వల్ల పేగులు సాఫీగా పని చేయడంతో మలబద్ధకం కూడా క్రమంగా తగ్గిపోతుంది.
నెయ్యి నీటిని కలిపి తీసుకుంటే శరీరంలోని మంట తగ్గి కీళ్ల నొప్పులు తగ్గిపోవడంలో కూడా సహాయపడుతుంది. వృద్ధాప్యంలో లేదా చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులను సహజరీతిలో తగ్గించే గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇది కీళ్లను నమ్యంగా, బలంగా ఉంచుతుంది.
ఇక చర్మానికి సంబంధించిన లాభాలు కూడా శాస్త్రీయంగా నిరూపితం అయ్యాయి. నెయ్యి నీరు లోపలి శరీర శుద్ధిని నిర్వహించడంలో సహాయపడుతుంది. రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోవడం వల్ల చర్మం సహజ ప్రకాశాన్ని తిరిగి పొందుతుంది. ముఖంపై ఉండే చిన్నచిన్న మచ్చలు, మురికివర్ణం, మొటిమల దుష్ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా నెయ్యి నీరు ఉపయోగకరం. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుందని, అనవసరంగా తినే అలవాటును తగ్గిస్తుంది. ఈ విధంగా రోజువారీ కాలరీలు తగ్గిపోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయం అందుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది. మొత్తం మీద, ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం శరీరానికి శుద్ధి, శక్తి, ఆరోగ్యం మూడు విధాలుగా ఉపయోగపడే సులభమైన సహజ మార్గం.
ALSO READ: Jewelry Insurance: బంగారం పోతే.. ఆ నష్టాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా..?





