
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- తమకు పక్కా నోబెల్ శాంతి బహుమతి వస్తుంది అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమాతో నేడు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ట్రంప్ అనుకున్న ఆశలు సమాధి అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ట్రంప్ తనకు నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో కచ్చితంగా నిరాశ చెంది ఉంటారు. నాకు నోబెల్ శాంతి ప్రైస్ రాదు అని బయటకు చెప్పుకొస్తున్న ట్రంప్ లో లోపల చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ తను అనుకున్న ఆశలు చిగురించలేదు. ఇప్పటివరకు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఈ విషయం నేటితో అంతమవునుంది. దీంతో ఆగ్రహం లో ఉన్నటువంటి ట్రంప్ ఏ దేశం పై ఏ రూపంలో విరుచుకుపడతారో అనేది ప్రతి ఒక్క దేశ పౌరుడికి ఆందోళన లేకపోలేదు. ఇంకా ఎన్ని యుద్ధాలు ఆపితే కానీ నోబెల్ ప్రైజ్ బహుమతి ఇస్తారు అనే ఆలోచనలో ట్రంప్ పడినట్టు ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతి రావాలంటే ఇంకా ఏం చేయాలని ఆలోచనలు మొదలుపెట్టినట్టున్నారు డోనాల్డ్ ట్రంప్. నేడు విడుదల చేసినా నోబెల్ శాంతి బహుమతిని వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను అనే మహిళకు వరించింది . 1967, అక్టోబర్ 7వ తేదీన జన్మించిన మరియా 2002లో రాజకీయాల్లోకి ఎంటరింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ వెంటే వెనుజులా కు నేషనల్ కోఆర్డినేటర్ గా పని చేశారు. 2018లో బీబీసీ 100 ఉమెన్, టైం మ్యాగజైన్ వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో ఒకరిగా నిలిచారు. ఈమె డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన త్యాగానికి గాను నార్వే నోబెల్ కమిటీ అవార్డుకు ఎంపిక చేసింది. కాగా ఈమెపై దేశం దాటి వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.
Read also : లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు అట్టహాసంగా ప్రారంభం.. గంధం ఎత్తిన నల్లగొండ పోలీసులు
Read also : నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న సీఎం… బీసీ అంశంపై క్లారిటీ వస్తుందా?