ఆంధ్ర ప్రదేశ్

రోజా,గోరంట్ల మాధవ్ పై మండిపడ్డ హోంమంత్రి అనిత?..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై హోం మంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో పోలీస్ శాఖలో జగన్ ప్రభుత్వం ఎటువంటి నియామకాలు చేపట్టలేదని మంత్రి అనిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాజాగా గుంటూరులోని పోలీస్ కార్యాలయం వేదికగా పోలీసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా అలాగే గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. రోజా అలాగే గోరంట్ల మాధవ్ అసభ్యకర వ్యాఖ్యలు, విమర్శలు తీరు వారి సంస్కారానికి నిదర్శనమని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి నాయకులు పోలీసులను కూడా బెదిరించి అప్పర్ హెడ్ తీసుకోవాలని చాలాసార్లు అనుకున్నట్లుగా హోంమంత్రి తెలిపారు. అప్పటి వైసిపి చర్యలకు కాలం సమాధానం ఇప్పుడు చెబుతుందని అన్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 30 ఫోక్ షో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని తెలిపారు. ప్రజల రక్షణ ధ్యేయంగా పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ మరియు ఐడెంటిఫికేషన్ సిస్టం ఇలాంటి వ్యవస్థలన్నిటిని కూడా వైసిపి విధ్వంసం చేసిందని హోం మంత్రి అనిత ధ్వజమెత్తారు. కేవలం సీసీ కెమెరాల ద్వారానే 70% కేసులలో నిందితులను పట్టుకోవడం జరిగింది అని తెలిపారు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు వైసిపి ప్రభుత్వానికి అని మండిపడింది. గోరంట్ల మాధవ్ అలాగే రోజా లాంటి సంస్కారహీనులను నా జీవితంలో ఎప్పుడు చూడలేదని తెలిపారు.

విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తర్వాత… నెక్ట్స్‌ ఎవరు..?

అంతా కేసీఆరే చేశాడు – ఆ ఒక్క తప్పే కొంపముంచిదన్న ఎర్రబెల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button