క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) విభాగంలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను హోంగార్డుల హోదాలో విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గుర్తింపు మరియు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వీరు ప్రధానంగా చెరువుల సంరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాలుపంచుకుంటారు. ఎంపికైన వారికి సుమారు 10 రోజుల పాటు ట్రాఫిక్ నిర్వహణ మరియు ఇతర భద్రతా అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరికి హోంగార్డులతో సమానంగా గౌరవ వేతనం మరియు ప్రత్యేక యూనిఫాంను కూడా ప్రభుత్వం కేటాయించనుంది.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా, అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో 39 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి, వారికి గౌరవప్రదమైన ఉపాధిని కల్పించారు.





