క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో HMPV వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా ‘తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘HmPV వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే, ఇది మ్యుటేషన్ అవునా, కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు.
Read Also : ప్రారంభమైన హైడ్రా గ్రీవెన్స్.. స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ రంగానాథ్
కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ HMPV వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ HMPV వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ప్రస్తుతం ఈపాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ హర్షగుప్తా తెలిపారు. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. తమ ల్యాబ్‌లో శాంపిల్‌ను పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. ” రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు” అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. చైనాలో ఆందోళనకు కారణమైన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ లేదా HMPV కొత్తది కాదు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2001లో ఇది మొదటిసారిగా కనుగొన్నారు. అయితే, కొన్ని సెరోలాజిక్ ఆధారాలు 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
- అలా అయితే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయండి : YCP అధికార ప్రతినిధి
- వెల్‌కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన తెలంగాణ యువకుడు !.. కానీ ప్రభుత్వం నుండి నో సపోర్ట్?
- అయ్యప్ప సొసైటీలో అన్ని అక్రమ నిర్మాణాలే.. యాక్షన్ తప్పదన్న హైడ్రా