
జగిత్యాల జిల్లా బ్యూరో (క్రైమ్ మిర్రర్):- జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడలోని జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ను విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. వారు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రామును కలసి, దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో, హెచ్‌ఎం విద్యార్థుల కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, విద్యార్థినులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ చర్యలు విద్యా స్థలంలో భద్రతకే ముప్పుగా మారాయని పేర్కొంటూ, తక్షణమే విచారణ చేపట్టి బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మల్లీ అదే పొరపాటు చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం..!?
ఈ ఘటనపై స్పందించిన డీఈవో, విషయాన్ని తీవ్రంగా తీసుకుంటామని, విద్యార్థుల భద్రతకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.సమాజంలో ఇలాంటి అక్రమ చర్యలకు తావులేకుండా, బాధితులను రక్షిస్తూ, నిందితులను శీఘ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి అక్రమ చర్యలకు సమాజంలో చోటు ఉండకూడదని, బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.
అక్రమార్కులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్