- పెరిగిన ఎయిడ్స్ మరణాలు
- అవగాహన లోపంతోనే వ్యాధి వ్యాప్తికి కారణం
హైదరాబాద్, క్రైం మిర్రర్ః
తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో కేసులు తగ్గినప్పటికీ ఇటీవలికాలంలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మరణాలు కూడ ఎక్కువగానే పెరుగుతున్నాయి.
.కేంద్రం ప్రకారం, 2020–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్‌ఐవీతో మరణించారు. మొత్తం 44,140 మంది మరణించారు.
ఏపీలో పెరిగినమరణాల సంఖ్య…
ఏపీలో హెచ్‌ఐవీ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్, చికిత్స సౌకర్యాల కొరత, అవగాహన లోపం కారణంగా వ్యాధి బాధితులు మరణిస్తున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఈ ట్రెండ్‌ను అరికట్టే చర్యలు చేపట్టాలి.
టెస్టింగ్ లోపాల సమస్య…
తెలంగాణలోని నగరాల్లో ఏఆర్‌టి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, గ్రామాల్లో వ్యాప్తి, టెస్టింగ్ లోపాలు సమస్య. యువతలో వ్యాప్తి పెరుగుతోంది.
వైరస్ గుర్తింపులో జాప్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. వైద్య సేవల ఆలస్యం, స్టిగ్మా, టెస్టింగ్‌లో భయం మరణాలకు దారితీస్తున్నాయి.
కాగా ఓవరాల్ చూస్తే రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఉచిత టెస్టింగ్, ఏఆర్‌టీ మందులు, అవగాహన కార్యక్రమాలు పెంచాలి.
యువతపై దృష్టి పెట్టి, స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తే మరణాలు తగ్గించే అవకాశం ఉంటుంది. దీని కేంద్ర, రాష్ట్రాలు కలిసి చర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు.





