క్రీడలు

మళ్లీ అడుగుపెట్టనున్న హిట్ మాన్… ఫ్యాన్స్ కు పూనకాలే!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ షురూ చేశారు. గత కొంతకాలంగా రెస్టు తీసుకున్న రోహిత్ శర్మ మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే టెస్ట్ ఫార్మేట్ కు అలాగే టి20 ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేలకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మను సెలెక్ట్ చేయడంతో వెంటనే నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఆస్ట్రేలియా పరిస్థితిలకు తగ్గట్లుగా పిచ్ ను ఎంపిక చేసుకొని రోహిత్ శర్మ నెట్స్ లో సాధన చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ కాగా ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చిస్తున్నారు. దాదాపు పది మంది ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియా తో భారత్ వన్డే సిరీస్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

Read also : ఆ తేదీనే OTT లోకి…?

ఇక మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఈ వన్డే మ్యాచ్ ఆడుతారని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా మిగతా ఫార్మటులకు రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటివరకు కూడా రెస్టు తీసుకున్నటువంటి రోహిత్ శర్మ నేడు… మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. గతంలో లాగానే రోహిత్ శర్మ మళ్ళీ సిక్సులతో వీర విహారం చేస్తే మాత్రం… ఫ్యాన్స్ కు పూనకాలే అని అంటున్నారు. అయితే మొన్నటివరకు ప్రతి ఒక్కరు కూడా రోహిత్ శర్మనే వన్డే కు కెప్టెన్గా వ్యవహరిస్తారు అని అంతా కూడా భావించారు. కానీ అనుకోని విధంగా ఈసారి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కూడా గిల్ కు అప్పగించారు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఒకింత దిగులు చెందిన… కనీసం బ్యాటింగ్ అయినా చూడొచ్చు అని ఆనందపడుతున్నారు. దీంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే కాంగ్రెస్ కు షాక్.. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button