తెలంగాణ

గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్.. డేంజర్ లో హైదరాబాద్

హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలకు శివారులోని హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ఎగువన ఉన్న వికారాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో మూసీ ఉప నదులు ఈసీ, మూసీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మొయినా బాద్, వికారాబాద్ నుంచి భారీగా వరద హిమాయత్ సాగర్ లోక వస్తోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ జలాశయం ఒక గేటు ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు.

హిమాయత్‌ సాగర్‌ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 2.73 టీఎంసీలకు చేరింది. హిమయత్‌సాగర్‌కు ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. పై నుంచి వరద పెరుగుతుండటంతో అవుట్ ఫ్లో పెంచుతున్నారు అధికారులు. అటు గండిపేట జలాశయం కూడా నిండిపోయింది. ఏ క్షణమైనా గండిపేట జలాశయం గేట్లు ఎత్తనున్నారు అధికారుల. దీంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా వరద కొనసాగుతోంది. ఏక్షణంలో నైనా క్రస్ట్‌ గేట్స్ ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి సాగర్‌కు 65వేల 876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం 588.70 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌ పూర్థి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా..308.1702 టీఎంసీలకు చేరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button