ఆంధ్ర ప్రదేశ్

ఇకపై హెల్మెంట్స్ తప్పనిసరి!… ఏపీ లో జరిగే రోడ్డు ప్రమాదలపై కోర్టు సీరియస్?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. సిసి కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది.హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సంగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. అక్కడే హెల్మెట్‌ ఉందా లేదా చూసి రికార్డుల తనిఖీ అన్ని జరిగిపోతాయన్నారు.

రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ఎంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుకున కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించింది. అలాంటి చేయని వారిపై మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది.

Rad also

1.ఆట మధ్యలో ఘోరంగా కొట్టుకున్న ప్లేయర్లు!… కారణం ఏంటంటే?

2.సన్యాసం తీసుకున్న అందమైన హీరోయిన్.. కుంభమేళాలో అద్భుతం

3.రూ. 55 లక్షలకు కిడ్నీ.. హైదరాబాద్ కేసులో సంచలనాలు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button