తెలంగాణ

తెలంగాణ లోకల్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

  • స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే

  • బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ముగిసిన విచారణ

  • జీవో నెంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు

  • 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులిస్తూ తీర్పు వెల్లడించింది. కౌంటర్‌ దాఖలుకు పిటిషన్లకు రెండువారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది.

లోకల్‌ ఎన్నికలకు బ్రేక్‌
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో ఎలక్షన్‌ ప్రక్రియ ఆరువారాల పాటు బ్రేక్‌ పడనుంది. తదనంతరం అత్యున్నత న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై ఎన్నికల భవితవ్యం ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button