
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజులు భారత పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. పుతిన్ ఎప్పుడైతే తన విమానం నుంచి బయటకు వచ్చారో వెంటనే ప్రోటోకాల్ పాటించకుండానే నరేంద్ర మోడీ నేరుగా పుతిన్ ను హగ్ చేసుకుని ఆహ్వానించారు. దీన్నిబట్టి వీరిద్దరి మధ్య ఎంత సన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో అతను బస చేసేటువంటి హోటల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్ లో పుతిన్ విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే ఆ హోటల్ లో పుతిన్ విశ్రాంతి తీసుకోవడానికి అద్దె ఎంత కడుతున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పుతిన్ బస చేసే ఈ ప్రత్యేకమైన రూమ్ కు ఒకరాత్రి అద్దె సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది అని సమాచారం. ఇప్పటికే ఈ హోటల్ చుట్టూ అలాగే ఎంట్రన్స్ వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. యాక్సెస్ కంట్రోల్ మరియు రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను భారీ ఎత్తున మొహరించారు. ఇక ఈ మౌర్య హోటల్ ను భద్రత బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Read also : మంచి బౌలర్లను పక్కన పెట్టేస్తున్నారు.. అలా చేయకండి : హర్భజన్ సింగ్
Read also : అఖండ -2 అప్డేట్ వచ్చేసింది… ఎందుకు ఆగిపోయిందంటే?





