
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- అఖండ అనే సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకి అందరూ ఫిదా అయ్యారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అదిరిపోయింది. ఇక అదే జోష్ లో బాలకృష్ణతో అఖండ -2 ను నిర్మించారు. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా డిసెంబర్ 5వ తేదీన చాలా ఘనంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇదే సందర్భంలో ఈ సినిమాలోని హీరోయిన్ సంయుక్త మీనన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్ గా ఉండడంతో పాటు నా క్యారెక్టర్ సినిమా కథను మలుపు తిప్పుతుంది అని ఆమె వెల్లడించారు. ఈ సినిమా లో అవకాశం వచ్చినప్పుడు ఇతర సినిమాలలో బిజీగా ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరి నటించాను అని తెలిపారు. ఈ సినిమా అభిమానుల అంచనాల గురించి ఉండబోతుంది అని.. ప్రతి ఒక్కరూ డిసెంబర్ 5వ తేదీన థియేటర్లకు వచ్చే సినిమాలు చూడండి అని హీరోయిన్ సంయుక్త తెలిపారు. ఇక ప్రస్తుతం సంయుక్త మీనాన్ స్వయంభు మరియు నారి నారి నడుమ మురారి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.
Read also : తిరుమలలో ప్రకృతి సౌందర్య నాట్యం… తిలకిస్తున్న భక్తులు!
Read also : Supreme Court: అక్రమంగా వచ్చిన వారికి హక్కులేంటి? సుప్రీం సీరియస్!





