
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- లవ్ బర్డ్స్ అనే పేరు మీద ఫుల్ ట్రెండింగ్ లో టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక అనే చెప్పవచ్చు. వీరిద్దరూ గత నాలుగు సంవత్సరాల నుంచి డేటింగ్ లో ఉన్నట్లుగా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా చాలానే రూమర్స్ వచ్చాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా సినీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా ఈ బంధం గురించి హీరోయిన్ రష్మిక మందన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నేను విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటాను అని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది అని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కొన్ని రూమర్స్ అనేవి ప్రచారంలో ఉన్నాయి. వీటన్నిటికీ సరైన సమయం వచ్చినప్పుడే వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుతాను అని అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా నిజమనేది తెలుస్తుంది అని హీరోయిన్ రష్మిక మందన ఆసక్తికరమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. అయితే మరోవైపు వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలో జరుగుతుంది అని ఇప్పటికే చాలా వార్తలు కోడై కూస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో?.. ఏది అబద్దమో?.. వీరిద్దరూ స్పష్టత ఇస్తే గాని క్లారిటీ రాదు. కానీ వీరిద్దరూ ఎన్నో సందర్భాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరిలా మారిన రైతు రుణమాఫీ పథకం..!
రాత్రిపూట భార్యను చంపి, అనంతరం 16 ఏళ్ల కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు..





