
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడిగిపెట్టి ఇవాళ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు ఈ మధ్యనే పార్టీ పెట్టి తమిళనాడులో హీరో విజయ్ ఇప్పుడిప్పుడే రాజకీయాలలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు హీరోల మధ్యనే రాజకీయ విభేదాలు మొదలయ్యాయని చెప్పాలి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జయకేతనం పేరిట జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం పై టీవీ కే పార్టీ అధినేత హీరో విజయ్ స్పందించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాష పై మాట్లాడిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటుగా కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడడు : హరీష్ రావు
హిందీ భాష వద్దు కానీ.. హిందీ సినిమాలపై వచ్చే డబ్బులు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని తమిళనాడు రాష్ట్రానికి ప్రశ్న వదిలారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాదినే ఉత్తమం అనే భావన వచ్చిందని ఎద్దేవ చేశారు. ఆవిర్భావ సభ జనసేనది కాదు అని అది బిజెపి ఎజెండ సభ అని చెప్పుకొచ్చారు. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలామందికి తమిళనాడు రాష్ట్రంలో జీవనోపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇతర భాషలపై మాకు గౌరవం ఉందని… అలాగని మాపై అభాషలను రుద్దడం మంచిది కాదు అని అన్నారు.
CM Revanth Reddy : పదేళ్లు నేనే సీఎం.. భట్టి, ఉత్తమ్‍కు రేవంత్ షాక్!