ఆంధ్ర ప్రదేశ్సినిమా

ఏపీ సీఎం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు సుమన్!..

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గురించి టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి హీరో సుమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో, తన విజనరీతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. ఆదివారం నాడు మీడియా సమావేశంలో పాల్గొన్న నటుడు సుమన్… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత సంక్షోభం వచ్చిన కూడా క్షణాల్లో పరిష్కరించే శక్తి నారా చంద్రబాబునాయుడుకు ఉందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అలాగే రాజధాని అమరావతిని చక్కదిద్దాలంటే కచ్చితంగా అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.

గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తీరును ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు హైటెక్ సిటీ మరియు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అటువంటి నిర్మాణాలను ఎంత చక్కగా తన విజనరీతో తీర్చిదిద్దారు అనేది ప్రస్తుతం ఉన్న యువకులకు తెలియకపోవచ్చు కానీ ఆనాటి వ్యక్తులకు కచ్చితంగా ఈ అభివృద్ధి తెలిసే ఉంటుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాంటి అభివృద్ధిలు చేయాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడు కే సాధ్యమని అన్నారు. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా తయారు చేయాలంటే ఎవరికైనా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతాయని నమ్మారు. అభివృద్ధి జరగాలంటే కొంచెం సమయం కావాలి అని… కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండాలని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బిజెపి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం ఉంది కాబట్టి పనులు కూడా వేగంగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని ఆశించారు.

హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్, యువతి హత్యకు ప్లాన్!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భగ్గుమంటున్న పశ్చిమాసియా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button