ఆంధ్ర ప్రదేశ్సినిమా

ఎన్టీఆర్ వద్దన్నా… చాలా మొండిగా ఆ సినిమా తీశాను: మోహన్ బాబు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ ఒకప్పటి హీరో మోహన్ బాబు తన లైఫ్ లో జరిగిన ఒక విషయాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు. అయితే నా జీవితంలోనే నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి తీసిన సినిమా ఒకటి ఉందని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన బాల్యం తన కెరీర్ గురించి ఆడియన్స్ కు పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ ను నేనెప్పుడూ పట్టించుకోనని అన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడికలను నా జీవితంలో ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. అయితే నేను చూసిన తొలి సినిమా రాజమకుటం. ఎవరికి చెప్పకుండా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆ సినిమా చూశానని అన్నారు. దాసరి నారాయణరావు నాకు సినిమాల్లో మొట్టమొదటి అవకాశం ఇచ్చారని అన్నారు. ఇక 1975లో స్వర్గం- నరకం సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యానని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి ” మేజర్ చంద్రకాంత్” అనే సినిమాను తీశాను. అప్పటికే అన్నగారు ( ఎన్టీఆర్) ఇంత డబ్బుతో ఈ సినిమాను వద్దు అని వారించారు. కానీ చాలా మొండిగా ఆ సినిమా తీశాను… అలాగే మంచిగా సక్సెస్ అయ్యాను అని అన్నారు. అయితే మోహన్ బాబు ఈ ఇంటర్వ్యూలు భాగంగానే రాజకీయాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు. నా జీవితంలో నేను కోరుకున్నవి అన్ని జరిగాయి. కానీ చాలామంది రాజకీయాల్లోకి రావాలని అన్నారు కానీ నాకు అవి సెట్ కావు అని సైలెంట్ గా ఉన్నానని అన్నారు. జీవితంలో పిల్లలతో సరదాగా ఉండాలి అనుకున్నాను. దాదాపు 560 సినిమాలు పైగా చేశాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button