
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో కొందరు వాహనాలు నడపడం ద్వారా, మరీ ముఖ్యంగా ఈ శీతాకాలం వేళల్లో పొగ మంచు కారణంగా రోడ్లు సరిగా కనపడక ఇలా ఏదో ఒక సందర్భంలో రోడ్డు ప్రమాదాలు జరిగి కొన్ని వేలమంది చనిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో తోటి ప్రజలు సహాయం చేయకపోవడం వల్ల మరి కొంతమంది బతకాల్సిన వారు కూడా చనిపోతున్నారు అని.. ఇకపై అలా జరగడానికి వీలు లేకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు.
Read also : హీరోయిన్ ను అసభ్యకరంగా తాకిన ఘటన.. పలువురుపై కేసులు నమోదు!
ఇకపై రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్తే వారిని “రహ్ వీర్” (హీరో ఆఫ్ ది రోడ్) గా గుర్తించడమే కాకుండా వారికి 25 వేల రూపాయల రివార్డు కూడా ఇస్తాము అని కీలక ప్రకటన చేశారు. గతంలో రోడ్డు ప్రమాదాల వ్యక్తులను కాపాడితే కాపాడిన వ్యక్తులను కూడా పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి మరీ విచారించేవారు. ఇప్పుడు పోలీసులు అలాగే లీగల్ భయాలు లేకుండా బాధితులకు సహాయం చేయాలి అని.. ఇకపై అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు అని బాధితులకు సకాలంలో సహాయం చేయడం వల్ల ప్రతి ఏడాది కూడా 50,000 మందిని కాపాడవచ్చు అని తెలియజేశారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ఏడు రోజుల చికిత్సకు గాను 1,50,000 వరకు ప్రభుత్వమే ఇస్తుంది అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు నుంచి ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేయండి.
Read also : ఇలా చేస్తే పేద ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాలి : వైఎస్ జగన్





