
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- టీవీకే అధినేత, నటుడు విజయ్ ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న కరూర్ లో జరిగినటువంటి ఘటన తర్వాత చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందో… అని విజయ్ ఇంటికి నలువైపుల కూడా బారి కేడ్లు ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతం వైపు ఎవరుని కూడా రానివ్వకుండా నిలిపివేశారు. నిన్న కరూర్ లో జరిగినటువంటి విజయ్ సభలో భారీ తొక్కిసలాట జరగడంతో ఏకంగా 39 మంది మృతి చెందారు. ఇందులో పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉండడం… కొన్ని వందల మంది గాయపడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రసంగించాల్సిన సభలో పదివేల మందికి మాత్రమే అనుమతి ఉంటే ఏకంగా లక్ష మందికి పైగానే అక్కడికి భారీగా చేరుకోవడంతో విజయ్ ప్రసంగం ప్రారంభించిన 15 నిమిషాలకే మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆస్పత్రులు మొత్తం కూడా ఈ తొక్కిసలాటలో లో చనిపోయిన వారు.. గాయపడిన వారు.. స్పృహ కోల్పోయిన వారితోనే నిండిపోయింది.
Read also : నేడే IND vs PAK మ్యాచ్… ఇప్పటికీ కూడా ఎందుకు?
అయితే నిన్న సభ అనంతరం విజయ్ చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే అక్కడికి భారీగా పోలీసులు బందోబస్తుగా వచ్చి ఎవరిని అటువైపు రాకుండా చూసుకుంటున్నారు. ఘటన తరువాత కొంతమంది డీఎంకే కార్యకర్తలు విజయ్ ఇంటిని చుట్టుముట్టి నిరసన తెలిపేందుకు తీవ్రంగా ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు విజయ్ పార్టీ కార్యకర్తలు కూడా విజయ్ కి సపోర్ట్ గా నిలిచేందుకు భారీగా కార్యకర్తలు తన ఇంటి వద్దకు చేరుకోగా వారిని కూడా పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించారు. ధీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని.. చాలామందిలో అయోమయం నెలకొంది. మరోవైపు సీఎం స్టాలిన్ ఈ ఘటనపై పూర్తిగా విచారం జరిపిన తర్వాతే కఠిన నిర్ణయాలు తీసుకోగలమని అన్నారు.ఈ ఘటనపై ఎక్కడ కూడా రాజకీయం చేయనని అన్నారు. మరి ఈ ఘటనపై విజయ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారనుంది.
Read also : ఘటనపై రాజకీయం చేయను… ఆ తర్వాతనే అరెస్ట్ చేస్తాం : సీఎం స్టాలిన్