
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్ :-మహేశ్వరంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందబస్తును ఏర్పాటు చేసినట్లు మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కల్పించామన్నారు. మహేశ్వరం మండల పరిధిలో 30 గ్రామాలలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల్లో 101 మంది సర్పంచ్ అభ్యర్దు లు పోటీలో ఉన్నారు. 252 వార్డులు,252 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు.పోలింగ్ జరిగే సమయాల్లో పోలింగ్ అధికారులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్ స్టేషన్ల వద్ద నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థులు,వర్డ్ మెంబెర్స్ గెలిచిన ఉత్సాహంలో బాణసంచాలు కాల్చకూడదని సూచించారు.గెలిచిన అభ్యర్థి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీలు చేసే ప్రయత్నం చేయాకూడదన్నారు. పోలీసులకు సహకరించి జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత మైన వాతావరణంలో ముగించుకోవాలని పోలీసులకు మహేశ్వరం గ్రామ ప్రజలకు పోలీసులు సూచించారు.
Read also : ఎమ్మెల్యేను కలిసిన గుజ్జుల మహేష్
Read also : Cleaning: మీ గ్యాస్ స్టవ్ జిడ్డు తొలగించడానికి ఇంటి చిట్కాలు





