
క్రైమ్ మిర్రర్, వరంగల్ :- తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మొత్తం కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం అంతా కూడా నీట మునిగిపోయింది. భారీ వర్షాలకు తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా మునిగిపోయి కనిపిస్తుంది. పూర్తిగా రైల్వే పట్టాలపై నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ మొత్తం కూడా షిప్పింగ్ హార్బర్ ను పోలి ఉంది. ఏకంగా ఫ్లాట్ఫారం ఎత్తు అంతవరకు వరద నీరు నిలిచిపోయింది. దీంతో వరంగల్ ప్రాంతం వైపు వచ్చేటువంటి రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు వరంగల్ నగరం అంతా కూడా ముప్పులో చిక్కుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇలానే మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిస్తే మాత్రం వరంగల్ నగరం అంతా కూడా జలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన రహదారులు మరియు కొన్ని రైల్వేస్టేషన్ల అన్నిట్లోకి పూర్తిగా నీరు చేరిపోతుంది.
Read also: సమీకరణాలు ఎందుకు కుదరడం లేదు…అడ్డుపడేది ఎవరు?.. : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
కాగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాలన్నీ కూడా జలదిగ్బంధంతో కూడుకున్నాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లే కూలీలు, జాబ్ చేసి వ్యక్తులు కూడా బయటకు వెళ్లలేకపోతున్నారు. ప్రయాణాలు చేయాల్సినటువంటి వ్యక్తులు కూడా ఈ భారీ వర్షాల కారణంగా ప్లానింగ్స్ అన్నీ కూడా రద్దు చేసుకుంటున్నారు. రెండు రోజులపాటు వర్షాలు తగ్గి పూర్తిగా ఎండలు రాకపోతే ఈ సమస్యలు మరికొన్ని రోజులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే రైల్వే అధికారులు మరియు వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉండి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలగగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రయాణాలకు అంతరాయం కలుగుతుంది. దీంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read also : రొమాంటిక్ రోల్ చేయడం అస్సలు నచ్చలేదు : అనుపమ