క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో నేడు వర్షాలు కురవనున్నాయి. నిన్నటి వరకు ఎండలతో సతమతమవుతున్న ప్రజలు వర్షాలు రాక వార్తలతో కాస్త సంబరపడిపోతున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన జిల్లాలు :-
1. మెదక్
2. హైదరాబాద్
3. కామారెడ్డి
4. మేడ్చల్
5. నిజామాబాద్
6. రంగారెడ్డి
7. సంగారెడ్డి
8. సిద్దిపేట
9. యాదాద్రి
పైన పేర్కొన్న ఈ తొమ్మిది జిల్లాలలో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురవచ్చు అని హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతోనే నిన్నటి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి అని తెలిపింది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు వర్షాల పట్ల కాస్త అప్రమత్తం గా ఉండాలని అధికారులు సూచించారు.
పెళ్లి ముసుగులో భారీ మోసాలు.. సజ్జనార్ కీలక సూచనలు?
Vasamsetty Subhash: కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి స్ట్రైట్ వార్నింగ్

