
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రజలు కూడా ఈ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు ఒకవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా… హైదరాబాదులో మూసీ నది ఉగ్ర ప్రవాహానికి MGBS మొత్తం కూడా నీటి మునిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేడు మరో 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు.
Read also : ఏపీలో వర్షాలు… నిమ్మల రామానాయుడుకు కీలక సూచనలు చేసిన చంద్రబాబు!
తెలంగాణలో ఈరోజు వర్షాలు పడే 6 జిల్లాలు :-
1. ఖమ్మం
2. భద్రాద్రి కొత్తగూడెం
3. ములుగు
4. మహబూబాబాద్
5. యాదాద్రి భువనగిరి
6. నల్గొండ
7. జనగాం
తద్వారా ఈ ఏడు జిల్లాల ప్రజలు నేడు కాస్త ఆప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత రెండు నెలల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వచ్చేనెల చివరి వారంలోపు తగ్గుముఖం పట్టి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి మరో నెలరోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉంటాయని.. ప్రతిరోజు కూలి పనులకు వెళ్లేవారు అలాగే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
Read also : తెలుగోడు విరుచుకుపడడానికి అతడే కారణం?