
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడతాయని అధికారులు వెల్లడించారు.
ఏపీ లో భారీ వర్షాలు కురిసే జిల్లాలు
1. బాపట్ల
2. ప్రకాశం
3. నెల్లూరు
4. చిత్తూరు
5. తిరుపతి
పైన పేర్కొన్న ఈ ఐదు జిల్లాలలో గాలులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి ముఖ్యంగా పైన పేర్కొన్నటువంటి ఐదు జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాల ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్పు బయటకు వెళ్ళవద్దని సూచించారు. దీపావళి పండుగ కారణంగా పిల్లల పై తల్లిదండ్రులు ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. హెచ్చరించారు.
Read also : కళాకారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు
Read also : బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ చేస్తాం..!