
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు దాటికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అక్కడక్కడ నీరు నిలిచిపోయింది. పనుల నిమిత్తం ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో వర్షాలు పడే జిల్లాలు :-
1. గుంటూరు
2. బాపట్ల
3. పశ్చిమగోదావరి
4. పల్నాడు
5. ప్రకాశం
6. నెల్లూరు
7. అనంతపురం
8. కడప
9. తిరుపతి
10. ఏలూరు
11. కర్నూల్
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే జిల్లాలు :-
1. నిజామాబాద్
2. నిర్మల్
3. హైదరాబాద్
4. మహబూబ్నగర్
5. వనపర్తి
6. కామారెడ్డి
7. గద్వాల్
8. నల్గొండ
9. జగిత్యాల్
10. సిరిసిల్ల
11. మహబూబాబాద్
12. నాగర్ కర్నూల్
13. నారాయణపేట్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పైనున్న జిల్లాలలో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడక్కడ అయితే ఏకంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని… ఈ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యాలకు కూడా గురయ్యేటి వంటి అవకాశం ఉందని అధికారులు జాగ్రత్తలను సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read also : ఏపీలో భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు.. రైతులు ఆవేదన!
Read also : రాష్ట్రం ఏమన్నా మీ అబ్బ సొత్తా.. నీవల్ల నష్టపోయేది విద్యార్థులే : మంత్రి సత్య కుమార్