
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నేడు ఒకవైపు ఏపీ మరోవైపు తెలంగాణలో పిడుగులు, ఈదురు గాలులతో కూడినటువంటి భయంకర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ సంవత్సరం లేని విధంగా ఈసారి రెండు నెలల నుంచి వర్షాలు ప్రతిరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి అంటే ఎంతలా ఈ వానలు తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాయో అర్థం అవుతుంది.
ఏపీలో వర్షాలు పడే జిల్లాలో
1. అల్లూరి సీతారామరాజు
2. బాపట్ల
3. పల్నాడు
4. ప్రకాశం
5. నంద్యాల
6. కడప
7. అన్నమయ్య
8. చిత్తూరు
తెలంగాణలో వర్షాలు పడే జిల్లాలు
1. భూపాలపల్లి
2. పెద్దపల్లి
3. ములుగు
4. ఖమ్మం
5. యాదాద్రి
6. వనపర్తి
7. వరంగల్
8. హైదరాబాద్
పైన పేర్కొన్న రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడుతాయని… కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Read also : అంతా సజావుగా జరిగింది.. నేడు విధుల్లోకి అడుగుపెట్టనున్న నూతన టీచర్లు
Read also : ఏంటి.. ఎల్లమ్మ సినిమాలో హీరోగా నితిన్ కాదా?