
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మరియు రేపు పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే కురిసినటువంటి వర్షాలకు ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడగా మరో రెండు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా…
1. సంగారెడ్డి
2. వికారాబాద్
3. రంగారెడ్డి
4. మెదక్
5. మేడ్చల్
6. సిద్దిపేట
7. కామారెడ్డి
8. నిర్మల్
9. నిజామాబాద్
10. సిరిసిల్ల
11. అదిలాబాద్
12. యాదాద్రి
13. ఆసిఫాబాద్
14. నల్గొండ
పైన పేర్కొన్న ఈ 14 జిల్లాలలో నేడు మరియు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం నుంచి వానలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వాన జల్లులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వెల్లడించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తమయి మరో రెండు రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.
Read also : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి, కేటీఆర్..!
Read also : టెస్లా.. టెస్లా.. త్వరలోనే ఎగిరే కార్లు వస్తాయంట?





