
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది సేపట్లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.
మరి కొద్దిసేపట్లో వర్షాలు పడే జిల్లాలు..
1. హైదరాబాద్
2. రంగారెడ్డి
3. మెదక్
4. మేడ్చల్ మల్కాజ్గిరి
5. సంగారెడ్డి
6. సిద్దిపేట
7. వికారాబాద్
8. యాదాద్రి భువనగిరి
పైన పేర్కొన్న ఎనిమిది జిల్లాల్లో మరికొద్ది సేపట్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్లు కంటే తక్కువగానే ఉంటుంది అని స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు అలాగే రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. కాగా ఈ వర్షాలు అక్టోబర్ నెల ఆఖరిలోపు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రజలు అప్పటివరకు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Read also : 2026 లోనైనా ట్రంప్ కు నోబెల్ దక్కేనా..?
read also : బాలానగర్ లో తీవ్ర విషాదం.. కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి