
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇదిలా ఉండగా మరో రెండు మూడు రోజులు పాటు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనలు చేశారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పాఠశాలలకు డిఈఓ రవికుమార్ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారనప్పటికీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు మేరకు అధికారులు అప్రమత్తం అయ్యి సెలవు ప్రకటించారు.
Read also : ఒకేసారి ఇద్దరు సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపులు… తీరా చూస్తే?
నరసన్నపేట, జలుమూరు, ఆముదాలవలస, కొత్తూరు, పోలాకి, శ్రీకాకుళం, గారా, హిరమండలం, సరుబుజ్జిలి, ఎల్ ఎన్ పేట మండలాల్లోని అన్ని స్కూళ్లకు ఈరోజు సెలవు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పారు. ఇక మన్యం జిల్లాల్లోని స్కూళ్లకు నిన్న డీఈవో సెలవు ప్రకటించారు. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అధికారి వర్షాలు అలాగే ఆకస్మిక వరదలు సంభవిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుండగా… ఆ జిల్లాల్లో వర్షపు ముప్పు లేదని అధికారులు కూడా ఎటువంటి సమాచారం అందించలేదు.
Read also : మరో నాలుగు రోజులు వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!