
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కోస్తాంధ్ర మరియు దక్షిణ తమిళనాడును అనుకోని ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా
1.ఏలూరు
2. కృష్ణ
3. ఎన్టీఆర్,
4. పల్నాడు
ఈ 4 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. ఈ వర్షాలు మరు నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ చోట్ల పడేటువంటి అవకాశాలు ఉన్నాయని.. ఈదురు గాలులు అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకు కురిసినటువంటి వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా వాహనదారులు కూడా నానా అవస్తులు పడుతున్నారు. ఈనెల చిరాకురిలోపు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని.. అప్పటివరకు కూడా వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి మరొక 15 రోజులు పాటు ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయట ప్రయాణాలు చేయవద్దని సూచించారు. మరి ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో ఎవరూ కూడా బయటకు రావద్దని, చెట్ల కింద అసలే ఉండవద్దని, కరెంట్ స్తంభాలను కూడా ముట్టుకోకూడదని పలు కండిషన్లు పెట్టారు. ఇదిలా ఉండగా… ఈ భారీ వర్షాలకు రైతులు కూడా పంటలు దెబ్బతింటున్నాయని అధికారులకు విన్నపిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
Read also : ఓటీటీ లో రికార్డు సృష్టించిన వార్ -2
Read also : మరికొద్ది సేపట్లో తెలంగాణలో భారీ వర్షాలు..!