
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయి తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో ఇవ్వాలా కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని APSDMA అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రకాశం, శ్రీ సత్య సాయి, అనంతపురం, కడప, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలలో మోస్తారు నుంచి తేలకపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. కాగా ఇప్పుడిప్పుడే దిత్వా తుఫాన్ బలహీనపడిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినా కూడా అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినగా.. వ్యవసాయ రైతులందరూ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట కూతకు వచ్చే సమయంలో ఇలా అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయామని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా తుఫాన్ ప్రభావం కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఎప్పటికప్పుడు సహాయక బృందాలు అందుబాటులో ఉండడం కారణంగా చాలానే ముప్పు తప్పింది అని చెప్పాలి.
Read also : తల్లి కడుపులో ఉన్నప్పుడే వినేశా.. “జై బాలయ్య”!
Read also : చలాన్లపై 100% డిస్కౌంట్.. ఫేక్ అని తేల్చిన హైదరాబాద్ పోలీసులు?





