
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు చాలానే ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత కొద్ది రోజులపాటు వర్షం పడకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఈరోజు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలే కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో అయితే తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో వర్షాలు పడే జిల్లాలు :-
1. తిరుపతి
2. నెల్లూరు
3. ప్రకాశం
4. అనంతపురం
5. సత్య సాయి
6. అన్నమయ్య
7. కడప
8. చిత్తూరు
పైన పేర్కొన్న ఈ 8 జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అలాగే మరోవైపు ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని.. దాని ప్రభావం కారణంగా ఈనెల 22వ తేదీ నుంచి దాదాపు మూడు రోజులపాటు భారీ వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు పట్టణాలలో నివసించేవారు.. ముఖ్యంగా పల్లెటూర్లలో నివసించేవారు వ్యవసాయం పట్ల తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి అని సూచించారు.
Read also : పెబ్బేరు లో ఘనంగా 14వ వార్షికోత్సవ శోభ యాత్ర
Read also : Upendra Dwivedi: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్… ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!





