క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు పడతాయని తాజాగా ఏపీ వాతావరణ నిపుణులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడినటువంటి వర్షాలు దంచి కొట్టనున్నాయి అని హెచ్చరించారు. ఏపీలో ఇవాళ మధ్యాహ్నం ఉభయగోదావరి, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు మన్యం జిల్లాలలో విపరీతంగా వర్షాలు పడతాయని తెలిపారు. అలాగే మరోవైపు ఇవాళ రాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలలో బీభత్సంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాబట్టి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక మేరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల పడుతున్నటువంటి వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వర్షాలు ఇలానే కొనసాగితే కచ్చితంగా వ్యవసాయం చేసేటటువంటి వారికి నష్టం చేయబోయే అవకాశం ఉంది.
స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి : సర్పంచ్ అద్దాల మహేందర్
ఉస్తాద్ భగత్ సింగ్… షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?
