Tuesday, March 10, 2026
Homeతెలంగాణతెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ వర్షాలు..

తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ వర్షాలు..

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని IMD కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇవాళ మరియు రేపు కొన్ని జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.

ఎలో అలర్ట్ ప్రకటించిన జిల్లాలు
1. మెదక్
2. సంగారెడ్డి
3. వికారాబాద్
4. కామారెడ్డి
5. మహబూబ్నగర్
6. జోగులాంబ గద్వాల
7. నారాయణపేట
8. వనపర్తి
9. ఖమ్మం

పైన పేర్కొన్న ఈ 9 జిల్లాలలో ఇవ్వాల, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్రమైన అల్పపీడనం వాయుగుండంగా మారితే…మరో రెండు రోజులపాటు తెలంగాణలోని పశ్చిమ మరియు దక్షిణ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఈ రెండు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి అని.. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని… వాహనదారులు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు.

Read also : కర్నూలు బస్సు దగ్ధం ఘటన… పూర్తి వివరాలు ఇవే..!

Read also : PKL 12… టాప్ 4 లో తెలుగు టైటాన్స్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments