
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడడం ద్వారా అది కాస్త బుధవారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని IMD ఏపీ ప్రజలకు మరొక షాకింగ్ న్యూస్ తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విపరీతంగా కురుస్తాయని అంచనా వేసింది. ఇక 3,4 వ తేదీలలో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక నేడు ఉత్తరాంధ్ర మరియు నంద్యాల జిల్లాలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు దంచి కొట్టనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీటమునగగా మరికొన్ని గ్రామాల్లో చాలా రోడ్లు చిత్తడి చిత్తడి అయ్యాయి. గత నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు అన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇక నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో.. నదుల పరివాహక ప్రాంతాలు నీళ్లలో మునిగిపోయాయి. దీంతో మరో మూడు రోజులపాటు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఒక అల్పపీడనం ద్వారా ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా దంచి కొట్టాయి. మళ్లీ రేపు ఏర్పడేటువంటి అల్పపీడనం ఇంకెంత నష్టాన్ని సృష్టిస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
Read also : ఎంజీబీఎస్ ఎందుకు మునిగింది.. మూసీ వరదలకు కారణం ఏంటి?
Read also : మన పిల్లల ఫ్యూచర్ కోసమే ఈ ఫ్యూచర్ సిటీ : సీఎం రేవంత్