
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రస్తుతం భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరొక కీలక సమాచారాన్ని అందించింది. అదేంటంటే… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో రాబోయే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మరో ఐదు రోజులపాటు ఈ జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని… అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిల్లలను కరెంటు స్తంభాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు పడే జిల్లాలు :-
1. నిజామాబాద్
2. ఆదిలాబాద్
3. నిర్మల్
4. వికారాబాద్
5. మహబూబ్ నగర్
6. సంగారెడ్డి
7. హైదరాబాద్
8. మెదక్
9. కామారెడ్డి
10. నారాయణపేట
11. సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 జిల్లాల లో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇతర జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజుల నుంచి హైదరాబాదు తో పాటుగా పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాబోయే మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. ప్రజలు కాస్త అయోమయంలో పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా ఏ విధంగా ఏ నష్టం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
Read also : సొంత పార్టీ కార్యకర్తకు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Read also : ఆ విమానంలో నేను కూడా ప్రయాణించాల్సి ఉంది.. కానీ : మీనా