
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం కూడా వెంటనే ఆప్రమత్తమయింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత అధికారులను వెంటనే ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో.. ఆయా ప్రాంతాల ప్రజలకు వెంటనే వేరేచోట షెల్టర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.
Read also : రేపటి నుంచి 50 శాతం సుంకాలు, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు భారీ వర్షాల కారణంగా సముద్రాలు, నదులు అలాగే చెరువులు పొంగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో లేదా నదులకు వేటకు వెళ్ళవద్దని మంత్రి అచ్చెనాయుడు మత్స్యకారులకు సూచించారు. ఇక రేపటి నుంచి వినాయక చవితి పండుగ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువకులు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గణేష్ మండపాలు కట్టే సమయంలో, వర్షాలు పడుతున్న సమయంలో, అలాగే గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు చూసుకోవాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు. పోలీసు అధికారులు కూడా అన్ని జిల్లాల్లోని ఆయా మండలాల్లో గణేష్ నిమజ్జనాలు జరిగేంతవరకు నిఘా ఉంచాలని ఆదేశించారు.
Read also : కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్