
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- రాయలసీమలో మునుపెప్పుడు లేని విధంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జరీ చేశారు. ద్రోణి ప్రభావంతో రాబోయే మరో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కడప జిల్లా పులివెందులలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో భారీగా వరద నీరు అనేది పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తూ ప్రమాదంగా మారింది. మరోవైపు అన్నమయ్య జిల్లాలో కూడా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇక నేడు పార్వతీపురం, అనంతపురం, ఏలూరు, కడప మరియు సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని… ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు ప్రజలు చాలా నష్టాలను చూశారు. ఇక వ్యవసాయదారులు గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాలకు పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, కొన్ని ఇల్లులు అయితే నేల కూలాయి.
Read also : ఏసీబీ వలలో రెవిన్యూ తిమింగలం..! లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
Read also : SSMB 29 టైటిల్ పేరు “వారణాసి”… పస లేదంటున్న అభిమానులు!