
గుండాల, క్రైమ్ మిర్రర్ : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వివిధ గ్రామాలలో ఐకెపి పిఎస్సిఎస్ సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్లో నిల్వ ఉన్న ధాన్యం పూర్తిగా వర్షానికి తడిసి ముద్దయింది నిర్వాహకులు రైతులకు ఇయ్యవలసిన తాడిపత్రిలు రైతులకు అందియలేకపోయారు. దీనికి తోడు దాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు ఇబ్బందుల్లో రైతులు వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు వస్తాకొండూరు గుండాల గ్రామాల మధ్యన భారీ వృక్షం పడిపోవడంతో దాదాపుగా రాకపోకలు నిలిచిపోయాయి పదిగంటలు అనంతరం స్థానిక ఎంపీడీవో ఎస్సై వివిధ శాఖల అధికారులు అక్కడికి వెళ్లి రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్టును తొలగించారు.
తురకల శాపురం గ్రామంలో ఈదురుగాలుల దుమారాలకు ఇంటి పై కప్పు లేచిపోవడంతో ఇంటిలోని సామాన్లు పూర్తిగా తడిసి ముద్దయి నిలువ నీడ లేకుండా ఇబ్బందులకు గురయ్యారు దీనికి తోడు రామారం గ్రామంలో పిడుగుపాటుకు మలిపెద్ది బక్కారెడ్డి అనే రైతుకు సంబంధించిన రెండు పాడి గేదెలు పిడుగు పడి మరణించాయి వివిధ గ్రామాలలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు రాకపోకలకు ఇబ్బంది కలిగిన గ్రామస్తులు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శుక్రవారం సాయంత్రం లోపు ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించి అనంతరం త్రాగునీరు అందించారు.