నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి తిరుమలలో ఆగకుండా వర్షం పడుతుండటంతో రోడ్లన్ని వర్షపు నీటితో నిండి పోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయం కాగా… ఆలయంలో కొద్ది పాటి వరద నీరు చేరుకుంది. స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు, స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్ద అయ్యారు. స్వామి వారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు.. తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా కంపార్ట్మెంట్లోకి షెడ్యూల్లోకి ఎప్పటికప్పుడు అనుమతిస్తున్నారు. నిర్విరామంగా భక్తులకు మంచినీళ్లు, పాలు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు.
ఇక వర్షం కారణంగా తిరుమల అంతటా కూడా దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతకు చంటి బిడ్డలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు, ఘాట్ రోడ్‌లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు జారిపడే ప్రమాదం ఉండడంతో వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలని టీటీడీ సూచించింది. ఎలాంటి ప్రమాదాలకు జరగకుండా ముందు జాగ్రత్తగా ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బందిని రెండు ఘాట్ రోడ్లలో అధికారులు అందుబాటులో ఉంచారు.
తిరుమల గిరులు హిమ గిరులుగా మారాయి. తెల్లని, చల్లని మంచు వీచికల పలకరింపులతో భక్తులు పులకరిస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీవారి ఆలయం పొగమంచులో మనోహరంగా దర్శనమిస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తోంది. జల్లుల్లో తడుస్తూ భక్తులు మురిసిపోతున్నారు. కొండల్ని కమ్మేసిన పొగమంచు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి ..
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి