
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. తాజాగా ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రుతుపవనాల కారణంగా బంగాళాఖాతం మీదుగా బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాబట్టి రానున్న 24 గంటల్లో రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ వర్షాలు రేపటితో తగ్గు ముఖం పట్టవని… అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని మరొక షాకింగ్ న్యూస్ తెలిపారు. ఈ వాయుగుండం ద్వారా రేపటి నుంచి మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. వీటి ద్వారా వ్యవసాయం కు మేలు జరుగుతుంది అని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత రెండు నెలల నుంచి కురిసిన వర్షాలకు పంటలు నాశనం అయ్యాయని మరి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం ఈ నెల చివరి ఆఖరిలోపు వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి.
Read also : ఆర్జీవి పై మరో కేసు నమోదు.. ఎందుకంటే..?
Read also : గుడికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పకుండా పాటించండి..!