
అకాల వర్షాలు హైదరాబాద్ ను ఆగమాగం చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిన్న హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ కూడా హైదరాబాద్ లోనే పలు ఏరియాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐదు గంటల్లోనే ఏకంగా 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఒక్కసారిగా వర్షం పడటంతో సిటీలోని ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్లే టైం కూడా కవాటంతో…దాదాపై సిటీ జనం ట్రాఫిక్ లోనే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ తో GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్‌ను నిన్న భారీ వర్షం ముంచెత్తింది. గంటపాటు కుండపోతగా కురిసిన వర్షానికి మహా నగరం అతలాకుతలమైంది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు చెరువులుగా మారిపోయాయి.హోర్డింగులు, చెట్లు కూలిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షానికి చార్మినార్ మినార్ పెచ్చులూడి కింద పడ్డాయి. పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వైపు పెచ్చులు పడటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
గాలివానకు ఖైరతాబాద్ నుండి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై ఓ భారీ వృక్షం కూలి కారుపై పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోయినా, కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే సంఘటన స్థలానికి డిఆర్ఎస్ బృందం చేరుకుని చెట్టును కట్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.