ఆంధ్ర ప్రదేశ్

భారీగా వస్తున్న వరద… శ్రీశైలం, సాగర్ నీటి విడుదల కొనసాగింపు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం డ్యాం అలాగే నాగార్జున డ్యాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీరుకు అలాగే త్రాగునీరుకు ఉపయోగపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో.. శ్రీశైలం అలాగే నాగార్జునసాగర్ డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం అలాగే నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. తాజాగా శ్రీశైలంకి 2,66,325 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

ఇక మరోవైపు నాగార్జునసాగర్ డ్యామ్ కు ఎగువ శ్రీశైలం నుంచి 2,82,478 క్యూసెక్కుల వరద వస్తుండడంతో… ఏకంగా 26 గేట్లను కూడా ఎత్తి 3, 13,016 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఈ ఏడాది ఒకే సమయంలో శ్రీశైలం డ్యాం మరియు నాగార్జున సాగర్ డ్యాం రెండు డ్యాముల నీరు కూడా విడుదల అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా జలకల సంతరించుకోవడంతో.. ఈ ఏడాది అలాగే వచ్చే ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగునీరులు అలాగే త్రాగునీరులో ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం లేదు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఆధారపడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నేడు ఒకవైపు శ్రీశైలానికి మరోవైపు నాగార్జునసాగర్ డ్యాం వైపు ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది.

రెండు డ్యాముల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా చాలామంది ఈ జలకలను చూడడానికి క్యూ కడుతున్నారు. కాగా ఈసారి ఒక నెల ముందుగానే.. అంటే జూలైలోనే నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తడం ఒక రికార్డు కింద చెప్పవచ్చు. దాదాపు 17 సంవత్సరాల క్రితం జులై నెలలో నాగార్జునసాగర్ డ్యాం పూర్తి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

  1. 25 శాతం సుంకం తప్పదు.. భారత్ కు ట్రంప్ హెచ్చరిక!

  2. భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌, ఒవైసీ షాకింగ్ కామెంట్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button