
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఏడు రోజుల నుండి ప్రతి రోజు 50,000 క్యూసెక్కు పైగా నీరు వచ్చి సాగర్ ప్రాజెక్టులో చేరుతుంది.దీంతో క్రమక్రమంగా నాగార్జున సాగర్ నీటిమట్టం పెరుగుతుంది.ఏడు రోజులలో 9 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది.ఏడు రోజుల క్రితం సాగర్ నీటిమట్టం 514.20 అడుగులు కాగా ప్రస్తుతం 523.60 అడుగులకు చేరుకుంది.నీటి నిల్వ సామర్థ్యం 138.9118 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 155.9228 టీఎంసీలుగా ఉంది.ఇదే వరద కొనసాగితే ఈ నెల చివరిలో సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంకు చేరుకుంటుంది.
ఈనెల చివరిలో పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరుకుంటే సాగర్ ఎడమ కాలువకు ఈనెల చివరిలో నీళ్లు వదలనున్నారు ప్రాజెక్ట్ అధికారులు.ఎడమ కాలువ పరిధిలో ఇప్పటికే నాట్లు వేసుకొని వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నా రైతులు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో : 67,019 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. తాగునీటి అవసరాల కొరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఔట్ ఫ్లో 3,305 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 523.60 ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 155.9228 టీఎంసీలు గా ఉన్నది.