
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ
మెయిన్స్ మూల్యాంకనంలో తప్పిదాలపై పిటిషన్లు
జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని వినతి
మెయిన్స్ ను రద్దు చేయాలన్న పిటిషనర్ల తరపు లాయర్లు
పిటిషన్లపై వాదనలు పూర్తి చేయాలన్న హైకోర్టు
వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలన్న హైకోర్టు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పేపర్ మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. మెయిన్స్ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విన్నవించారు. మెయిన్స్ ను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం… వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది.