
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సరిగ్గా 18 ఏళ్లు కూడా దాటని యువకులు వాహనాలను అతివేగంతో నడుపుతూ ఉన్నారు. ఇక తాజాగా అహ్మదాబాద్ కు చెందినటువంటి ఒక యువ యూట్యూబర్ ప్రతిరోజు కూడా తన స్పోర్ట్స్ బైకుతో అతివేగంగా వెళుతూ విన్యాసాలు చేస్తూ.. ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. కానీ తాజాగా అతివేగంతోనే ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన యూట్యూబర్ ప్రిన్స్ పటేల్ అనే యువకుడు తన KTM బైకు వేగంగా నడుపుతూ వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు. ప్రతిరోజు లాగానే హెల్మెంట్ పెట్టుకోకుండా అతివేగంగా వెళుతూ వీడియోలు తీసుకునే క్రమంలోనే బైకు స్కిట్ అయి డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ క్రమంలోనే అతని తల తెగిపోయినట్లుగా పోలీసులు తాజాగా సిసి ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. 140 kmph వేగంతో వెళ్లడమే కాకుండా నిర్లక్ష్యం మూలంగానే ప్రిన్స్ మరణించాడు అని పోలీసులు తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలకు 20 ఏళ్లు వస్తే కానీ బైకులు కొనివద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనతో ప్రతి ఒక్క స్పోర్ట్స్ బైకర్ అప్రమత్తం అవ్వాలని తెలిపారు.
Read also : సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి.. విద్యుత్ చార్జీలు కూడా పెంచట్లేదు : సీఎం చంద్రబాబు
Read also : హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్సై సంజయ్ సావంత్ మృతి..!





